ఉట్కూర్: సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

50பார்த்தது
ఉట్కూర్: సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి
విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కృష్ణంరాజు అన్నారు. గురువారం ఊట్కూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ మోసాలు, షి టీమ్, రోడ్డు భద్రతా నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఓటిపి, ఏటీఎం నంబర్లు చెప్పకూడదని అన్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. ఆకతాయిలు వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி