రోజురోజుకు కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కృష్ణరాజు అన్నారు. మంగళవారం ఉట్కూర్ మండల కేంద్రంలో ప్రజలకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఓటీపీ, ఏటీఎం నంబర్లు ఇవ్వకూడదని సూచించారు. క్రికెట్ బెట్టింగ్ లో పాల్గొని యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్పారు. సిబ్బంది పాల్గొన్నారు.