పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎమ్మెల్యే శ్రీహరి

56பார்த்தது
నర్వ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను మంగళవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సందర్శించారు. పోలీస్ స్టేషన్ లో నెలకొన్న సమస్యలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. వర్షానికి పోలీస్ స్టేషన్ కారుతోందని సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమస్యను వివరించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி