భుత్పూర్ రిజర్వాయర్ ద్వారా ముంపుకు గురైన గ్రామాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడారు. భుత్పూర్, నేరడగం ముంపు గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయని, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వాటిని పరిష్కరించాలని కోరారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతుల నష్టపరిహారం పై స్పష్టత ఇవ్వాలని సీఎంను కోరారు.