మైనార్టీల సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించిందని, ముస్లింల కోసం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎంఏ రషీద్ అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరపున మక్తల్ లోని రాయల్ ఫంక్షన్ హాల్ లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని ఉపవాస దీక్షలు విరమించారు.