ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి రేపు బుధవారం నర్వ మండలంలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నయ్య సాగర్ తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా మంజూరైన 108 అంబులెన్స్ ను ప్రారంభిస్తారని, అనంతరం బాధితులకు సిఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేస్తారని చెప్పారు. యాంకి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభిస్తారని అన్నారు.