రాజుల కాలం నాటి చంద్రఘడ్ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి కోటను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పురావస్తు శాఖ అధికారులతో ఈ ప్రాంతాన్ని అధ్యయనం చేయించి పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెప్పారు. తక్షణ సహాయం కింద పది లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.