రైతు డిక్లరేషన్ ను కాంగ్రెస్ తుంగలో తొక్కింది: ఎంపి అరుణ
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సోమవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతుహామీల సాధనదీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతు డిక్లరేషన్ ను కాంగ్రెస్ తుంగలో తొక్కిందన్నారు. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వడ్లకు బోనస్ ఇస్తామన్న హామీని కాంగ్రెస్ విస్మరించిందని ఎంపి అరుణ విమర్శించారు.