రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాలంటే సభ్యత్వాలు పెంచాల్సిందేనని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలోని ఎంవీఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో బీజేపీ సభ్యత్వ నమోదుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ. పార్టీ బలపడితేనే భవిష్యత్ లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. కార్యకర్తలంతా ఒక యజ్ఞంలా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.