నేటి నుంచి మండలాల్లోనే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. ఇక నుంచి ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించేలా ప్రతి మండలాల్లో కూడా ప్రజావాణి కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా కేంద్రానికి ఫిర్యాదు దారులు వచ్చే సమయంతో పాటు ప్రయాణ ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.