ఎగువన కురుస్తున్న వర్షాలకు పెద్దవాగు ప్రవాహం వస్తుండటంతో సోమవారం దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ఆదివారం ప్రవాహం కొద్దిమేర తగ్గడంతో ఒక గేటును అడుగు మేర ఎత్తి 400 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32. 6 అడుగులు కాగా ప్రస్తుతం 32. 5 అడుగుల మేర నిల్వ చేస్తూ వచ్చిన నీటిని వచ్చినట్లే వదులుతున్నారు.