ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శుక్రవారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా పాలకొండ పెద్ద చెరువు ముత్తడి దుంకుతుంది. ఎగువ ప్రాంతాలైన నవాబుపేట మండలం ఫతేపూర్ కాకర్లపాడు, జైనల్లిపూర్, రుద్రారం, కుల్కచర్ల అటవీ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఆ ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు చిక్కుడు వాగు ద్వారా పాలకొండ చెరువులోకి ప్రవహిస్తోంది. దీంతో చిక్కుడు వాగు పూర్తిస్థాయిలో నీటిమట్టానికి చేరుకుని మత్తడిపోస్తోంది.