పేద ప్రైవేట్ టీచర్లకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పించడానికి కృషి చేస్తానని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీలు బంద్ లకు పిలుపునిచ్చినప్పుడు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు బంద్ కు మద్దతిస్తూ తమ స్కూళ్లను బంద్ చేయడం మానుకోవాలని కోరారు. జడ్చర్లలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.