మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మోటార్ లైన్ లో వర్షం పడిందంటే చాలు వాహనదారులు, వ్యాపారస్తులు జంకుతున్నారు. కొద్దిపాటి వర్షం కురిసినా మోటార్ లైన్ ప్రాంతంలో ఎక్కడ నీళ్లు అక్కడే నిలిచిపోతున్నాయి. మోటార్ లైన్ ప్రాంతానికి మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాల నుంచి తమ వాహనాల మరమ్మత్తుల కోసం వందలాది మంది ప్రతి రోజు వస్తుంటారు. కనీస వసతులు కూడా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.