కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లోని ధర్నా చౌక్ (ఇందిరా పార్క్) వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రైతు హామీల సాధన దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఆదేశాల మేరకు బీజేపీ యువజన మోర్చా జిల్లా అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, బీజేపీ నాయకులు సంజీవయ్య, కౌన్సిలర్ కుమ్మరి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.