కల్వకుర్తి పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన డబల్ బెడ్ రూమ్ లకు అన్ని రకాల వసతులు కల్పించి దసరా లోపల లబ్ధిదారులకు అందజేయాలని, లబ్ధిదారుల పోరాట సంఘం కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎవరు నిరసనలు తెలపాల్సిన అవసరం లేదని, సాధ్యమైనంత త్వరలో లబ్ధిదారులకు అందజేసే బాధ్యత మాదేనని తెలిపారు.