
వంగూర్: పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులు
వంగూర్ మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సోమవారం మోటివేషనల్, గైడెన్స్ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోటివేషన్, గైడెన్స్ నిపుణులు పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థి జీవితంలో 10వ తరగతి కీలకమని, ప్రణాళికతో చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు కెవిన్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.