తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామానికి ప్రభుత్వ ఆసుపత్రిని మంజూరు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి అతి త్వరలో ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి అన్ని రకాల చర్యలతో పాటు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.