జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలో నూతనంగా బీటీ రోడ్డు నిర్మిస్తున్నందున టిప్పర్లు ఓవర్ లోడ్ తో వాహనాలు నడపకూడదని ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఓవర్ లోడ్ వల్ల బీటీ రోడ్లు పాడైపోతున్నాయని, దీనివల్ల వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. వెంటనే ఎస్ఐ తిరుపాజీ ఓవర్ లోడ్ తో వెళ్తున్న 2 టిప్పర్లపై చర్యలు తీసుకోవాలన్నారు.