భవిష్యత్తు బాగుండాలంటే విద్యార్థులు చక్కగా చదువుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం హన్వాడ మండలం రామన్నపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో రూ. 41. 5 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయకూడదని, పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధికి సహకరించాలన్నారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.