పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బతికిన పద్మశ్రీ వనజీవి రామయ్య మరణం బాధాకరం, పర్యావరణానికి తీరని లోటు అని మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమం వన మహోత్సవానికి రామయ్య పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.