జమ్మిచేడు జమ్ములమ్మకు విశేష పూజలు

71பார்த்தது
జమ్మిచేడు జమ్ములమ్మకు విశేష పూజలు
గద్వాల జిల్లా పరిధిలోని జమ్మిచేడులో వెలిసిన జమ్ములమ్మకు మంగళవారం విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారి విగ్రహాన్ని అభిషేకించి, అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంగళవారం సందర్భంగా జమ్ములమ్మను దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు అని ప్రధాన పూజారి తెలిపారు.

தொடர்புடைய செய்தி