గద్వాల పట్టణంలోని గాంధీ చౌక్ (29వ వార్డు)నుంచి గంజిపేట రోడ్డుకి వెళ్లే రహదారిలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా రోడ్డుపై ఉన్న చెత్త ఎక్కడ చెత్త అక్కడే అన్నట్టు ఉంది. ఉదయం సమయం 11 దాటినా కూడా చెత్త ఎత్తిన వారు లేరు. దుర్వాసనకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక కాలనీ ప్రజలు తెలిపారు. మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి చెత్త తొలగించగలరని కాలనీ ప్రజలు కోరుకుంటున్నారు.