జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం విఠలాపురంలో ఆదివారం ఉదయం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాముని శోభాయాత్ర నేత్రపర్వంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం జైశ్రీరామ్ అంటూ బాజా భజంత్రీలతో సీతారాముల శోభాయాత్రను కనుల పండువగా జరిపారు. భక్తులు సీతారాముల శోభాయాత్రను కనులారా తిలకించారు.