మహబూబ్ నగర్: జూపల్లి సమక్షంలో ముడా చైర్మన్గా లక్ష్మణ్ యాదవ్ బాధ్యతలు
మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కె. లక్ష్మణ్ యాదవ్ ముడా కార్యాలయంలో బుధవారం రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.