గత ఏడాది కరువుతో అల్లాడిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ఏడాది సానుకూల వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీరు లేక గతేడాదిలో రబీ సీజన్ క్రాప్ హాలిడే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జూన్ ఆరంభం నుంచే వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో రైతులు ఆశాజనకంగా పంటల సాగు చేపట్టారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు జలకళ నెలకొనడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.