వర్షాకాలంలో వంకాయలు తింటే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వంకాయల్లో ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఆల్కలాయిడ్స్ అంటే కూరగాయలు రసాయనాల నుంచి తమని తాము కాపాడుకునేందుకు ఏర్పరుచుకునే టాక్సిక్ కెమికల్స్. కాబట్టి వీటిని వర్షాకాలంలో తినడం అంత మంచిది కాదు. ఆల్కలాయిడ్స్ తినడం వల్ల దద్దుర్లు, చర్మంపై దురద, వికారం, రాషెస్ వంటి ఎలర్జీలు కనిపిస్తాయి. ఇది కాకుండా, రోగనిరోధక వ్యవస్థ కూడా తగ్గుతుంది.