మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రామ్ మందిర్ చౌరస్తా వద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి ఆంజనేయ స్వామి శోభాయాత్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హిందూ సంఘాలు, భక్తుల మధ్య శోభాయాత్ర కనులపండువగా కొనసాగింది. జై హనుమాన్ నినాదాలతో మహబూబ్ నగర్ పట్టణం దద్దరిల్లింది.