కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రం పరిధిలోని తాహశీల్దార్ కార్యాలయ పరిసరాలలో నూతనంగా నిర్మించనున్న 50 పడకల ఆసుపత్రి భవనం కోసం సోమవారం అధికారులతో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి స్థల పరిశీలన చేశారు. అనంతరం కానయపల్లిలో 2024-డీఎస్సీలో వనపర్తి జిల్లా టాపర్ గా నిలిచి, ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన లక్ష్మీని సన్మానించి కుటుంబ సభ్యులకు శుభాభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.