మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కె. లక్ష్మణ్ యాదవ్ ముడా కార్యాలయంలో బుధవారం రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.