హనుమాన్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం రాచాలలో గ్రామ యువత ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో భాగంగా యువత జై శ్రీరామ్ నినాదాలతో గ్రామ వీధులను హోరెత్తించారు. దేశం కోసం, ధర్మం కోసం కట్టుబడి నిబద్ధతతో పని చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, హిందూ సంఘాలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.