దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో దేవరకద్ర, కౌకుంట్ల మండలాలకు చెందిన లబ్ధిదారులకు శుక్రవారం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 7లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన, గత ప్రభుత్వ విధ్వంసాన్ని చక్కదిద్దుకుంటూ ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.