దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జానంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని మధ్యాహ్నం 3: 00 గంటలకు ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3: 30 గంటలకు కొమిరెడ్డిపల్లిలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారని మండలం కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు.