దేవరకద్ర నియోజకవర్గం కురుమూర్తి స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు, జాతర ఘనంగా నిర్వహించేందుకు మూకుమ్మడిగా అందరం కలిసి పనిచేసి విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నూతన పాలకమండలి, అధికారులు నిరంతరం భక్తులకు అందుబాటులో ఉండి ఏర్పాట్లను, మౌలిక వసతులు పర్యవేక్షించాలని, తాను బ్రహ్మోత్సవాలు ప్రారంభం నుంచి ముగిసే వరకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ జాతరలో పర్యటిస్తానని తెలిపారు.