మహబూబ్ నగర్ జిల్లాలో రోజురోజుకు వేసవి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. దేవరకద్ర నియోజకవర్గం శనివారం చిన్నచింతకుంటలో 39. 7 డిగ్రీలు, భూత్ పూర్ మండలం కొత్తమొల్గర 39. 6 డిగ్రీలు, నవాబుపేటలో 39. 5 డిగ్రీలు, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ లో 39. 4 డిగ్రీలు, మిడ్జిల్ 39. 3 డిగ్రీలు, కోయిలకొండ మండలం పారుపల్లిలో 39. 1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరుగుతున్న ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.