AP: నంద్యాల జిల్లా బొమ్మలసత్రంలో విషాదం చోటు చేసుకుంది. ఎస్‌బీఐ కాలనీకి చెందిన సుబ్బరాయుడు (43), సరస్వతి (37) దంపతులకు సునీల్ అనే కొడుకు ఉన్నాడు. బీటెక్ ఫెయిల్ అయ్యి ఆటో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో సునీల్ ఓ హిజ్రాతో ప్రేమలో పడ్డాడు. ఆ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో సునీల్‌ను బంధువుల వద్దకు పంపారు. దాంతో హిజ్రాల బృందం సుబ్బరాయుడు దంపతులు నడుపుతున్న షాపు వద్దకు వచ్చి వేధించేవారు. దాంతో మనస్థాపానికి గురైన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.