బైక్‌ను ఢీకొట్టి, అర కిలోమీటర్ లాక్కెళ్లిన లారీ (వీడియో)

77பார்த்தது
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగ్రాలో మంగళవారం అర్థరాత్రి ఓ లారీ బైక్‌ను ఢీకొట్టి, అర కిలోమీటర్ దూరం లాక్కెళ్లింది. ఈ ఘటనలో లారీ ముందు భాగంలో బైక్‌తో సహా ఇద్దరు వ్యక్తులు ఇరుక్కున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, ట్రక్కును ఆపాలని ఎంత అరిచినా ఆ ట్రక్కు డ్రైవర్ ఆపలేదు. చివరికి ట్రక్కును ఆపేసి ఆ డ్రైవర్‌ను చితకబాదారు. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி