సిద్దిపేట జిల్లా రాయపోలు మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. తిమ్మక్కపల్లి సమీపంలో చిరుతపులి సంచరించినట్లు పాదముద్రలు బయటపడ్డాయి. చిరుతపులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీ అధికారులు చిరుత ఆనవాళ్లు సేకరించారు. చిరుతపులి సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.