ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్‌

60பார்த்தது
ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్‌
BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ ఫార్ములా ఈ-రేస్‌ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. న్యాయవాది రామచంద్రరావుతో కలిసి ఆయన ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌ స్టేట్‌మెంట్ ఆధారంగా అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. విచారణలో కేటీఆర్ లాయర్‌కు కనిపించేలా ఏర్పాట్లు చేశారు. ఈ-రేస్‌ ఒప్పందంలో కేటీఆర్‌ పాత్రపై ఆరా తీయనున్నారు. విదేశీ సంస్థకు నగదు చెల్లింపుల్లో ఆయన ఇచ్చిన ఆదేశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది.

தொடர்புடைய செய்தி