ఇల్లందులో ఘనంగా మేడే వేడుకలు

65பார்த்தது
ఇల్లందులో ఘనంగా మేడే వేడుకలు
ఇల్లందులో మేడే 138వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సీపీఎం, సీఐటీయు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కార్యాలయాల వద్ద అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా, ఐకేపీ, హాస్టల్, డైలీవేజ్, మున్సిపల్, సింగరేణి, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, సోలార్, పవర్ ప్లాంట్, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా తదితర సంఘాల నేతలు జెండా ఆవిష్కరణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జెండాను ఎగుర వేశారు.

தொடர்புடைய செய்தி