మణుగూరు: కుమారుడు, కోడలు చూడటం లేదని ఫిర్యాదు
కుమారుడు, కోడలు తన బాగోగులు చూడడం లేదని మణుగూరుకి చెందిన చల్లా కమలమ్మ అనే వృద్ధ మహిళ తహశీల్దార్ రాఘవరెడ్డికి సోమవారం పిర్యాదు చేశారు. తనకు రేషన్ కార్డు మంజూరు చేయాలని ఆయనను వేడుకుంది. స్పందించిన తహశీల్దార్ రాఘవరెడ్డి రేషన్ డీలర్తో మాట్లాడి వెంటనే ఆమెకు రేషన్ బియ్యం అందజేయాలని సూచించారు.