బూర్గంపాడు కానిస్టేబుల్ భూక్య సాగర్ ఆత్మహత్య చేసుకుని మరణించడం బాధాకరమని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు శివనాయక్ సోమవారం అన్నారు. జిల్లాలో గిరిజన ఉద్యోగులపై పై స్థాయి ఉన్నతాధికారులు అవమానాలకు గురి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి అవమానాల వల్లే సాగర్ మరణించాడని, ఆయన మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.