TG: ఇటీవల కాలంలో పలు హోటళ్లలోని ఆహార పదార్థాలలో చనిపోయిన జంతు కాళేబరాలు కనిపించడం వార్తలో చూసే ఉంటాం. ఇలాంటి ఘటనలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నా.. ఇంకా కొందరు తమ తీరు మార్చుకోవడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే భువనగురిలోని హోటల్ వివేరాలో చోటు చేసుకుంది. ఈ మేరకు ఓ కస్టమర్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయగా అందులో చంపొయిన జెర్రి కనిపించింది. ఈ ఘటనతో కస్టమర్ కంగుతిన్నారు. ఈ విషయంపై హోటల్ నిర్వాహకులను నిలదీయగా దాటవేసే ప్రయత్నం చేశారు.