ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ లో వివిధ సమస్యలపై భాదితులు, ప్రజలు స్టేషన్ కు వస్తుంటారు. అలా వచ్చిన వారిలో ఎవరో తమ పర్స్ ను పోగొట్టుకున్నారు. అయితే ఆ సమీపంలోనే ఆడుకుంటున్న పోలీస్ ల పిల్లలకు ఆ పర్స్ దొరకడంతో వెంటనే ఏడూళ్ళ బయ్యారం ఎస్ ఐ రాజ్ కుమార్ కు అందజేశారు. తమ తల్లిదండ్రులు తమకు ఎలాంటి విలువలు విద్య నేర్పుతున్నారో నిరూపించారు. ఈ సందర్భంగా ఎస్సై రాజకుమార్ పిల్లలను శభాష్ అంటూ మెచ్చుకుని అభినందించారు.