మణుగూరు ప్రభుత్వ ఐటిఐ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్ ట్రైనింగ్ కేంద్రాలను నియోజకవర్గం యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం కోరారు. మణుగూరు ప్రభుత్వ ఐటిఐలోని ఏటీసీ కేంద్రంలో 6 కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్నట్లు తెలిపారు. యువతకు మరింత ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.