మణుగూరు మండల కేంద్రంలోని సింగరేణి ప్రాంతంలో సింగరేణి బ్లాస్టింగ్ వ్యర్థాల కలుషిత నీరు తాగి శుక్రవారం 13 గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమారు లక్షన్నర విలువ చేసే గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు వాపోతున్నారు. సింగరేణి అధికారులు తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.