కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంకు చెందిన మారబోయిన లింగయ్య యాదవ్ ఎల్ ఐ సి ఏజెంట్ కుటుంబం. ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనే లక్ష్యంతో చదువుకున్న ఆయన.. డీఎస్సీ సాధించలేకపోయారు. చివరికి ఎల్ ఐ సి ఏజెంట్ గానే మిగిలిపోయారు. కానీ తండ్రి కలను కుమార్తె హరిత నిజం చేశారు. ఎస్ జీ టి కోసం సిద్ధమైన హరిత 43 ర్యాంక్ సాధించారు. హరిత ఎస్జీటీగా ఎంపికై హైదరాబాద్ లో నియమకపత్రం అందుకున్నారు.