జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని మణుగూరు మండల జర్నలిస్టులు పోలీస్ అధికారులను విజ్ఞప్తి చేశారు. శనివారం మణుగూరు డిఎస్పీని కలిసి ఇల్లందులో శుక్రవారం జర్నలిస్ట్ పై జరిగిన దాడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని జర్నలిస్టులు కోరారు.