కరకగూడెం మండలంలోని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ల సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. మంగళవారం రేగళ్ల, భట్టుపల్లి, సమత్భట్టుపల్లి, కన్నాయిగూడెం పంచాయతీలలో సుమారు రూ. 60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 8 సీసీరోడ్లను ప్రారంభించారు. అలాగే రేగళ్ల, సమత్ భట్టుపల్లి, కన్నాయిగూడెం పంచాయతీలో అన్ని శాఖల అధికారులతో సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.