బూర్గంపాడ్ మండలం సారపాక పట్టణంలో సోమవారం జరిగే ఐద్వా బహిరంగ సభను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి పాపినేని సరోజన ఆదివారం అన్నారు. ఈ సందర్భంగా సుందరయ్య నగర్ నుంచి సారపాక వరకు ర్యాలీ ఉంటుందన్నారు. దేశంలోని రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ బృందా కారత్ రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి హాజరవుతారని తెలిపారు